Saturday, July 27, 2024

ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు

Must Read

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20 డాలర్ల చొప్పున మొత్తం షేర్లను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు ఎలాన్ మస్క్. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ను వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన సోషల్ మీడియా వేదికగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పంద వార్తల నేపథ్యంలో నిన్న ట్విట్టర్ షేర్ల విలువ 3 శాతం పెరిగింది.

తాజా పరిణామాలపై ట్విటర్‌ కంపెనీ సీఈవో పరాగ్‌ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ డీల్‌కు ట్విటర్‌ ప్రపంచ బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ చేతికి వెళ్తున్న తరుణంలో.. సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. సోమవారం.. కంపెనీ ఉద్యోగులు, కీలక ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ భవితవ్యంపై వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌ ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో.. సోషల్‌ మీడియా కంపెనీలో అనిశ్చితి నెలకొనడయం ఖామని వ్యాఖ్యానించాడు. అలాగే.. ఈ కీలక సమయంలో లేఆఫ్‌లు ఉండబోవని ఉద్యోగులకు ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img