అక్షర శక్తి పరకాల: గురువారం పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ల్యాబ్ లను పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక, విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించాలని, నాణ్యతతో కూడిన గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ని కంప్యూటర్లు అవసరం అని, కంప్యూటర్లు త్వరలో వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. కళాశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కళాశాల ఆవరణలోప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలి అని తెలిపారు. సెప్టెంబర్ 3వ శనివారం పరకాల లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, పూర్వ విద్యార్థులు జాబ్ మేళాను ఉపయోగించుకొనేలా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సాంకేతిక విద్యను అందరికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ పరకాల యొక్క ఆశయం విద్యార్థులను ఉత్తమ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని వారిని దేశ సమగ్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగురు బిక్షపతి, పరకాల మండల అధ్యక్షుడు కట్కూరు దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, బొచ్చు రవి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు పరకాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.