అక్షర శక్తి పరకాల: రైతు రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, రైతులను మోసం చేయడం కాంగ్రెస్ కి కొత్తేమి కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రుణమాఫీ పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రణం చేసేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు పరకాల పట్టణంలోని అంబెడ్కర్ సెంటర్లో పరకాల, నడికూడా మండలాలు మరియు పరకాల పట్టణానికి చెందిన రైతులతో కలిసి రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పింది 40 వేళా కోట్లు, ఎస్ ఎల్ బి సి లో చెప్పింది 49 వేల 500 కోట్లు, కేబినెట్ లో చెప్పింది 30 వేల కోట్లు, మొన్న ప్రకటించింది 17900 కోట్లు, కానీ ఇప్పటివరకు రైతులకు చేరింది కేవలం 7500 కోట్లు మాత్రమేనని తెలిపారు. ముందు చెప్పిన రైతుల లెక్క మాత్రం 47 లక్షలు రుణమాఫీ చేసింది మాత్రం 17934 కోట్లు 22 లక్షల రైతులకు మాత్రమే.. మిగతా రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మొత్తం రుణమాఫీ చేశామని డ్యాన్సులు చేస్తారు, ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని మంత్రులు చెప్తారు. ఈ పొంతనలేని మాటలతో రైతులను మళ్ళీ మోసం చేయాలని చూస్తే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రైతుబంధు ఎగ్గొట్టారు, అదే తరహాలో రుణమాఫి కూడా ఎగ్గొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి సారి చేసిన లక్ష రుణమాఫీలోనే 35 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లు మాఫీ చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి 18 వేల కోట్లు మాత్రమేనా అని ప్రశ్నించారు. ఈ ఒక్క మాట చాలు కాంగ్రెస్ చేసిన మోసం ఏంటో చెప్పడానికి. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు రుణమాఫీ, రైతుబంధు ద్వారా లక్షా రెండు వేల కోట్లు పారదర్శకంగా రైతుల ఖాతాల్లో జమచేస్తుందని గుర్తు చేశారు. రేషన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగం, ఇన్కమ్ టాక్స్, పాస్ బుక్కులో పేర్లు లేవంటూ, కుంటూ సాకులు చెబుతూ, కొర్రీలు.. కోతలు పెట్టి అన్నదాతలను నిండా ముంచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బ్యాoకుల చుట్టూ.. అధికారుల చుట్టూ రైతులు తిరగలేక అటు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆగమతున్నారు. రైతు భరోసాను ఎత్తగొట్టి రైతు రుణమాఫీ పేరుతో రెవెఅంత్ రెడ్డి చేసిన డ్రామా పేలయ్యింది. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ రైతన్నలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి నుండి కాంగ్రెసోళ్లు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి ఉన్నటుందన్నారు. అసలు ఈ ప్రభత్వానికి రుణమాఫీ ఎంత అయ్యిందో తెలుసా..? లేదా..?.ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ అయ్యేదాకా ఆగేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రేస్ మెడలు వంచి రుణమాఫీ చేయిస్తాం. స్థానిక ఎమ్మెల్యే కి నియోజకవర్గ రైతులపైన నిజంగా ప్రేమ ఉంటే నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ కానీ రైతుల జాబితా సిద్ధం చేసి వెంటనే రుణమాఫీ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరు విజయపాల్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నల్లేల లింగమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు చింతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మడికొండ కుమార్ మరియు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.