అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎండా కాలంలో గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. మే నెల 1 నుంచి 15వ తేది వరకు అంగన్వాడీ టీచర్లకు, మే 16వ తేది నుంచి 30వ తేది వరకూ అంగన్వాడీ సహాయకులకు సెలవులు ఉండటంతో సర్కార్ అలర్ట్ అయ్యింది. అంగన్వాడీ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకే రేషన్ సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Previous article
Next article
Latest News