తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం బలగం.. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుని ఇప్పటికీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఇటీవలే ఓటీటీలో విడుదలై మరింత ఆదరణ దక్కించుకుంది. ఇదిలా ఉంటే దూరమైపోతున్న మానవ సంబంధాలను కథగా మార్చుకొని తీసిన బలగం చిత్రాన్ని చూసి చాలా మంది ప్రేక్షకులు విడిపోయిన తమ కుటుంబ సభ్యులను, బంధువులను కలుసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలోనూ జరిగింది.
సర్పంచ్ సమక్షంలో ఒక్కటైన సోదరులు
భూతగాదాలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం చిత్రం కలిపింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన అన్నదమ్ములు గుర్రం పోసులు, రవి ఓ స్థలం వివాదంలో గొడవపడి చాలా కాలం క్రితం విడిపోయారు. అయితే ఇటీవల గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి చొరవతో మండల కేంద్రంలోని డీఎన్‌ఆర్ ఫంక్షనల్ హాల్‌లో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన పోసులు, రవి తమ మనసును మార్చుకున్నారు. తమ మనస్పర్థాలు పక్కనపెట్టామని, ఇకనుంచీ కలిసే ఉంటామని సర్పంచ్ ముత్యంరెడ్డి సమక్షంలో ఒక్కటయ్యారు. వివాదంలో ఉన్న భూమి సమస్యను పరిష్కరించుకున్నారు. తమను కలిపిన గ్రామ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదమ్ముల్లో మార్పు రావడం చూసి గ్రామ సర్పంచ్ బలగం సినిమా చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Must Read