Saturday, July 27, 2024

లోగో రూపొందించండి నగదు పురస్కారం అందుకోండి

Must Read
  • వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి
    అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించి నూతన లోగో రూపకల్పన కోసం నిర్వహింబడే పోటీ పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ప్రస్తుతం వున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోగో స్థానంలో ‘ఎవర్ విక్టోరియస్’ క్యాప్షన్‌తో కూడిన నూతన లోగోను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించబడింది. ఈ నూతన లోగో రూపకల్పనలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా లోగో రూపకల్పన పోటీని నిర్వహించ‌ బడుతుంది. ఇందుకోసం ఆసక్తి కలిగిన డిజైనర్లు, వ్యక్తులుగాని లేదా వ్యక్తుల సమూహంగాని ఈ పోటీలో పాల్గొనేందుకు ఆర్హులు. ఉత్తమమైన లోగో రూపకల్పన చేసిన వారికి 50వేల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేయబడుతుందని తెలిపారు. నూతనంగా రూపొందిస్తున్న లోగో ఎవర్ విక్టోరియస్ అనే క్యాప్షతో పాటు, ప్రాంతీయ సంస్కృతి మరియు పోలీసింగ్ ను ప్రతిబింబిస్తూ లోగోను రూపొందించాల్సి ఉంటుంది. పోటీ దారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారిక ఈమెయిల్ cp-warangal@tspolice.gov.in కు మాత్రమే తమ ఎంట్రీలను పంపిచాల్సి వుంటుంది. ఎంట్రీతో పాటు రూపొందించబడిన లోగో డిజైన్ నందు పొందుపర్చిన అంశాలకు సంబంధించి పూర్తి సారంశాన్ని సంక్షిప్త వివరణ వ్రాయాల్సి వుంటుంది. ఈ పోటీల్లో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంగాని రూపొందించిన లోగో డిజైన్లకు సంబంధించి ఏంట్రీలు పంపించవచ్చును. పోటీలకు పంపించే లోగో డిజైన్ నందు ఎలాంటి రెచ్చగోట్టే అభ్యంతరకరమైన అంశాలు లేకుండా జాగ్రత్త పడటంతో పాటు, భారతీయ కాపీరైట్ 1951 చట్టాలను అతిక్రమించకుండా రూపోందించాల్సి వుంటుంది. కాపీరైట్ చట్టాలను అతిక్రమించి లేదా మూడ పక్షం నుంచి వచ్చే అభ్యంతరాలు, వివాదాలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాధ్యత వహించదు. తుదిగా ఏంపిక చేయబడి నగదు పురస్కారం పొందిన లోగో డిజైన్ ను రూపకల్పన చేసిన రూపకర్తకు లోగోపై హక్కును కోల్పోవడంతో పాటు లోగోపై పూర్తి హక్కులు పోలీస్ కమిషనరేటకు చెందుతాయి. ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు 25 సె.మీ వెడల్పు, 25 సె.మీ పొడవు సైజులో మూడు వందలకు పైగా రెజలుష్య తో కూడిన జె.పి.జి గాని పిడిఎఫ్ ఫార్మాట్ మరియు లోగోను సవరించేందుకుగా వీలుగా ఓపెన్ ఫై తో కలర్ లోగో డిజైన్ తయారు చేసి పంపించాల్సి వుంటుంది. లోగోను కేవలం డిజిజటల్ ఫ్లాట్ ఫారంపైనే రూపోందించాల్సి వుంటుంది. పంపించే లోగో డిజైనల్లో ఎలాంటి వాటర్ మార్క్ లు వుండరాదు. పోటీదారులు తమ ఎంట్రీలను పంపించాల్సిన చివరి తేదీ మే 31వ తారీఖు. ఈ పోటీలకు సంబంధించి పూర్తి తుది నిర్ణయం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిర్ణయించిన జ్యూరీ కమిటీ సభ్యులదే. మరింత సమాచారం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పౌర సంబంధాల అధికారి మన్నవ మోహన కృష్ణ, సెల్ నంబర్ 9440904687 సంప్రదించగలరు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img