అక్షరశక్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలల కళాశాలలోని ఉపాధ్యాయ మరియు అధ్యాపక ఖాళీలను తక్షణమే నియమించాలని కోరుతూ శనివారం సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదని అన్నారు. వెంటనే భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో కళాశాలలో ఉపాధ్యాయ అధ్యాపక లు లేక సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తెలిపారు పెరుగుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే గురుకుల పాఠశాల మరియు కళాశాలలో మూడు నెలలైనా నియమించకపోవడం బాధాకరమని ఇప్పటికైనా జిల్లా సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమించే విధంగా కృషి చేయాలని కోరాగా స్పందించిన జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వెంటనే ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీల భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగు శ్రావణ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆబోతు అశోక్, డోని కేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.