అక్షర శక్తి, హాసన్‌పర్తి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గ్రామ బొడ్రాయి 10వ వార్షికోత్సావం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్‌సీ భవనం కోసం హెల్త్ కేర్ సెంటర్ సిబ్బంది అడుగగా తరితిగతన భవనం పనులు పూర్తి చేపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పొరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి తిరుపతి, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, 66 డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, ఎర్రగటు గుట్ట డైరెక్టర్ ఆరేల్లి వెంకటస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షుడు నేదునూరి సునీల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు రామంచ దయాకర్ కిసాన్, వట్టే శ్రీనివాసరెడ్డి, బండ చంటి రెడ్డి, రాజన్ బాబు, బొడ్డిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, డివిజన్, మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.