Thursday, September 19, 2024

ప్రతి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లో నమోదైన జబ్బుల వివరాల లిస్టులను ఉంచాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్

Must Read

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్ చేయవలసిందిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆసుపత్రులు సూపర్డెంట్ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో బెడ్లకు నంబర్లు మరియు వార్డులకు నెంబర్లు వేసి పేషంట్ల వివరాలను ఆసుపత్రి ముందు బోర్డులపై ప్రదర్శించాలని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో త్రాగునీరు, శానిటేషన్, విద్యుత్తు, జనరేటర్లు, ప్లంబింగ్ , డీజిల్ వాడకం, శివరేజి సంబంధించిన రిజిస్టర్ లను నిర్వహించాలని, వాటిని ఆసుపత్రి సూపర్డెంట్లు ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి తనిఖీ చేయాలని అన్నారు. ఆసుపత్రిలోని వార్డులలో ఉన్న లైట్లు ఫ్యాన్లు ఇతర మరమ్మత్తులు వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే నిధులు సక్రమంగా వినియోగించాలని, మంజూరైన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లో నమోదైన జబ్బుల వివరాల లిస్టులను ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు, టీ బి ఆసుపత్రి కి అంబులెన్స్ కొరకు ప్రతిపాదనలు పంపించాల్సిందిగా కోరారు. పేషంట్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వారిని ఓపికతో పరీక్షించాలని సూచించారు. ఆసుపత్రులలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవలసిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీవోలు నారాయణ, వెంకటేష్ డిఎంహెచ్వో డాక్టర్ లలిత, ఆసుపత్రి సూపర్డెంట్లు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img