Tuesday, September 10, 2024

శభాష్ వరంగల్ పోలీస్

Must Read

వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి

ఇన్స్పెక్టర్ సాహసాన్ని అభినందించిన స్థానిక ప్రజలు

అక్షరశక్తి హనుమకొండ క్రైమ్:వరంగల్ నగర పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న లోతైన గుంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం పడి ప్రాణాలతో పోరాడుతున్నాడని కొంతమంది స్థానికులు డయల్ 100 కు సమాచారం రాగా వెంటనే BC 2 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ హఫీజ్ పాషా మట్టెవాడ సిఐ తుమ్మ గోపికి తెలపడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోగా దాదాపు 9 అడుగుల లోతు ఉన్న నీటి గుంతలో పడి ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు శభాష్ పోలీస్ అని ఇన్స్పెక్టర్ గోపిని ప్రశంసిస్తూ మీరు ఒక వ్యక్తికి పునర్జన్మ ఇచ్చారని ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి తో పాటు బ్లూ కోర్ట్ కానిస్టేబుల్స్ , సిబ్బందిని అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img