Monday, September 16, 2024

విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి- జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Must Read

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ జూనియర్ కళాశాలను, మోడల్‌ స్కూల్‌ వసతి గృహాన్ని బుధవారం కలెక్టర్‌ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనంపై ఆరా తీశారు. ఇంటర్ మీడియట్ తరగతులను కలెక్టర్ సందర్శించి ఆర్థిక, భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య తో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఫిర్యాదుల పెట్టె సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ హిమబిందు, కెర్టేకర్ అరుణ, నాయబ్ తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img