Thursday, September 19, 2024

ఫ్లాష్….ఫ్లాష్ : కేయూ భూ ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్….

Must Read

ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్…

.రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే….

కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు…..

అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ భూకబ్జాదరుల గుండెల్లో గుబులు మొదలయింది. ఈరోజు కేయూ భూకబ్జా దారుల భాగోతం బయట పడనుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రెవెన్యూ మరియు ల్యాండ్ సర్వే విభాగం అధికారులు కేయూ కు రానున్నారు. కేయూ కు చెందిన సర్వే నెంబర్ 229 లో ఏ. అర్ అశోక్ బాబుతో బాటు మరి కొందరు ఇండ్లు కట్టుకొని ఆ సర్వే నంబర్ లోని కొంత భాగాన్ని 235 సర్వే నెంబర్ గా చూయిస్తు భూకబ్జాలకు పాల్పడుతున్నారని గతంలో కేయూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి, కేయూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేయూ టీచర్స్ అసోసియేషన్ బాధ్యులు కూడా కేయూ భూములు కాపాడాలని భూకబ్జా దారులపై చర్యలు తీసుకొని ఇటీవల కొత్తగా వచ్చిన ఇన్చార్జి వీసీ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశారు. దీనితో ఏ ఆర్ పెండ్లి అశోక్ బాబును కేయూ నుండి ఆర్ట్స్ కాలేజీకి బదిలీ చేసారు. గత కొన్ని రోజుల కింద రెవెన్యూ అధికారులు 413, 414 సర్వే నెంబర్లలో వున్న భూమిని సర్వే చేయగా ఈరోజు కేవలం 235 సర్వే నెంబర్ ను సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులతో బాటు విజిలెన్స్ అధికారులు కూడా రావడంతో భూకబ్జా దారుల్లో ఆందోళన మొదలయింది.

మేము ఎటువంటి కేయూ భూములను ఆక్రమణ చేయలేదని మేము వేరే వారి దగ్గర నుండి కొన్నామని, యూనివర్సిటీ హాస్టల్ పక్కన నిర్మించిన చిన్న ప్రహరీ బయటనే వున్న వాటిని కోన్నామని భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అంటున్నప్పటికీ కేయూ భూములు కొన్నేళ్ల కిందటే కబ్జా అయ్యయాని కబ్జా చేసిన వారి దగ్గర కొన్నప్పటికీ అది కేయూ భూమి కాకుండా పొదని ఫిర్యాదు దారులు అంటున్నారు. గతంలో ల్యాండ్ సర్వే విభాగం వారు సర్వే చేసి భూ ఆక్రమణలు జరిగాయని రిపోర్టు ఇవ్వగా ఆ రిపోర్టు ప్రకారం వరంగల్ మున్సిపల్ అధికారులు 13 మందికి నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో ముగ్గురు కేయూ ఉద్యోగులు ఉండడం కూడా విదితమే. దీని కారణంగా కేయూ ల్యాండ్ కమిటీ సభ్యునిగా వున్న ఏ. ఆర్ అశోక్ బాబు ను ల్యాండ్ కమిటీ నుండి పాలక మండలి తొలగించింది. ఆ తర్వాత ల్యాండ్ కమిటీ రిపోర్టును తయారు చేసి అప్పటి వీసీ తాటికొండ రమేష్ కు సమర్పించారు. ఈ రిపోర్టు పాలక మండలి లో ఆమోదం పొందకుండా మాజీ వీసీ చాలా ప్రయత్నాలు చేసినట్టు అంతేకాకుండా భూ కబ్జా దారులకు మద్దతు పలుకుతున్నారని వీసీ పై కూడా ఫిర్యాదులు వెళ్లడంతో ఏ ఆర్ అశోక్ బాబు ను కాపాడడంలో వీసీ పాత్రపై కూడా అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. గతంలో సర్వ్ మరియు ల్యాండ్ రికార్డు మరియు రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్టు మరియు కేయూ ల్యాండ్ కమిటీ రిపోర్టులు తప్పు కానున్నాయా…అదే అధికారులు ఇప్పుడు మళ్ళీ విజిలెన్స్ అధికారుల సమక్షంలో సర్వే చేసి ఎటువంటి రిపోర్టు ఇస్తారో వేచి చూడాల్సి వుంది. భూకబ్జా దారులకు ఇప్పటికయినా శిక్షలు పడతాయా కేయూ భూములకు రక్షణ లభిస్తుందా తేలాల్సి వుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img