Thursday, September 19, 2024

దోపిడి విముక్తికి ఎర్రజెండా పోరాటాలే ప్రత్యామ్నాయం

Must Read

రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే బిజెపికి పుట్టగతులుండవు

అమరవీరులను స్మరిస్తూ ఎంసిపిఐ(యు) కాగడాల ప్రదర్శన

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట‌: ప్రజా సమస్యల పరిష్కారానికి, దోపిడి విముక్తికి ఎర్రజెండా పోరాటాలే ఏకైక ప్రత్యామ్నాయమని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి అన్నారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) – ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులను స్మరిస్తూ కాగడాలు కొవ్వొత్తులతో నర్సంపేట పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి భుక్తి వెట్టిచాకిరి విముక్తి కోసం నైజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సుమారు అయిదు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిందని, ఈ క్రమంలో అప్పటి నెహ్రూ ప్రభుత్వం నైజాం రజాకార్లకు అండగా నిలిచి ప్రజా ఉద్యమకారులపై నిరంకుశంగా కాల్పులు జరుపుతూ అణచివేత చర్యలకు పాల్పడి వేలాదిమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని, చివరకు ప్రజా తిరుగుబాటుకు నైజాం నవాబు తలవంచకు తప్ప లేదన్నారు. ఇలాంటి ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రైతాంగ పోరాటాన్ని వక్రీకరించి మతాన్ని అంటగట్టడం బిజెపికే చెల్లిందన్నారు. నేటి పాలకులు సైతం నైజాం నవాబు వలె పాలన కొనసాగిస్తూ ప్రజలకు చెందాల్సిన సంపదను దోపిడిదారులైన పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ విధానాల రూపొందిస్తున్నారని ఉత్పత్తిలో కీలక భూమిక పోషించే శ్రామిక వర్గ హక్కులను హరించి పోరాడితే అణచివేసేందుకు చట్టాలను మారుస్తున్నారని మన ప్రాంతాన్ని మనమే పాలించుకున్న నేటికీ నిలువ నీడలేని పేదలు 40 శాతంగా ఉన్నారని వివిధ రకాల భూములన్ని అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకునే పాలకూడే లేడని ఇలాంటి పరిస్థితుల్లో నాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతంగ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మార్క్సిస్టు యోధుడు అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ త్యాగనిరతి ఎంతో ఆదర్శనీయమని అలాంటి నాయకుని ఆదర్శాన్ని గుర్తించడంలో పాలకవర్గాలు వివక్షత పాటించడం సరైనది కాదని తక్షణమే నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కళాశాలకు ఆ మహనీయుని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, కలకొట్ల యాదగిరి, జన్ను రమేష్, డివిజన్ నాయకులు హనుమాన్ల రమేష్, గజవెల్లి జగపతి, రవి, జన్ను జమున, గడ్డం స్వరూప, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img