తెలంగాణలో 96 పోస్టులు ..
తుది గడువు జూన్ 11
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆదారం గా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్ధులు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 12,828 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాషగా ఉండటం తప్పనిసరి. వ యస్సు 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. జీతం నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380, ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మా ర్కుల మెరిట్ ఆదారంగానే నియామకాలు చేపడతారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం సంబంధిత వెబ్సైట్లో సంప్రదించవచ్చు