అక్షరశక్తి, హన్మకొండ: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 28న హన్మకొండ భద్రకాళీ బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ తెలిపారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి చెరువులో బోటు షికారు ప్రారంభం కానున్నది. 30 మంది సామర్థ్యంగా బోటు ను గురువారం ఉదయం 9 గంటలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా గురువారం నుండి బోటు షికారు నగర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు.