Tuesday, September 10, 2024

సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయండి

Must Read

బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఊరూరా, వాడవాడన అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడి అనేక త్యాగాలు చేసిన ఘన‌త సీపీఐకి ఉందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, వెట్టి చాకిరికి, దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం, సామాజిక న్యాయం కోసం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్నెన్నో సమరాలు చేసిన మహోజ్వల చరిత్ర సీపీఐ దేనన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక, అసంఘటితరంగ కార్మికుల, చేతివృత్తిదారుల, మహిళా, యువజన, విద్యార్థి మొదలైన ప్రజా సంఘాలను నిర్మాణం చేసి వారి హక్కుల సాధన కోసం అంకితభావంతో పోరాడుతున్నదన్నారు. నేడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రైవేటీకరిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ కార్మిక, కర్షక, శ్రమజీవుల హక్కులను హరిస్తూ ప్రజా కంటక పాలన కొనసాగిస్తున్నదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు అన్ని వర్గాల ప్రజలు ప్రతినబూనాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img