Friday, July 26, 2024

క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌… మ‌రికొద్ది గంట‌ల్లోనే ఆకాశంలో అద్బుతం

Must Read

ప్ర‌పంచ‌మంతా భార‌త్ వైపు చూస్తోన్న సంద‌ర్భం… మ‌న మువ్వ‌న్న‌ల జెండా చంద‌మామ‌ను ముద్దాడే స మ‌యం.. ప్ర‌తి భార‌తీయుడు ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్ష‌ణం రానే వ‌చ్చింది. మరికొద్ది గంటల్లోనే ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్‌-3 లోని ల్యాండర్ విక్రమ్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు సాయంత్రం చంద్రుడిపై కాలు మోపనుంది. ఇవాళ (ఆగస్టు 23, 2023) సాయంత్రం 6:04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ద‌క్షిణ దృవంపై దించాలని నిర్ణయించింది ఇస్రో. చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. చంద్రయాన్ -2 ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని చంద్రయాన్-3ని మరింత సమర్థంగా తీర్చిదిద్దామని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3 ప్రయోగంలో ఇస్రో ప్రధానంగా మూడు లక్ష్యాలు పెట్టుకుంది. అందులో మొదటిది.. చంద్రుడి దక్షిణ ధ్రు వంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం. రెండవది.. చంద్రుడి ఉపరితలం మీద రోవర్‌ దిగి సం చరించడం. మూడవది.. ల్యాండర్, రోవర్లు కలసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడం. ఈ ప్ర యోగం విజ‌య‌వంతం కావాల‌ని దేశ‌వ్యాప్తంగా ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. కాగా, నేటి సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత దృశ్యాన్ని రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులకు లైవ్ ద్వారా చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేర‌కు విద్యాసంస్ధలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీల్లో చంద్రయాన్ ల్యాండింగ్ దృశ్యాల్ని ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img