- జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
- అభినందించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆరేంద్ర శ్రీనివాసచారి – సుజాత దంపతుల కుమార్తె ధరణి థైక్వాండో పోటీల్లో ప్రతిభ చాటింది. డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడల్ సాధించింది. ఈమేరకు జనవరి 9 నుంచి 12 వరకు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోగల గురునానక్ యూనివర్సిటీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి థైక్వాండో ఉమెన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు జేఎన్‌టీయూ నుంచి ఎంపికైంది. ఈసందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తన కార్యాలయంలో ధరణిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎంపికవడం హర్షణీయం అన్నారు. నేషనల్ కాంపిటీషన్స్‌లో కూడా రాణిం చాలని, మానుకోట క్రీడా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షించారు. ధరణి నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా జాతీయస్థాయి థైక్వాండో పోటీలకు ఎంపికైన సందర్భంగా ధరణిని కళాశాల యాజమాన్యంతోపాటు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అభినందిం చారు.
Must Read