Monday, September 9, 2024

బిగ్‌బాస్ విన్న‌ర్ అత‌డే..!

Must Read

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ – 6 కి మరి కొద్ది గంట‌ల్లోనే శుభం కార్డు పడనంది. రేపు (డిసెంబర్ 18న) గ్రాండ్ ఫినాలే జరగనుండ‌గా, విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే శ్రీసత్య‌ ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరినే దానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. విజేత ఎవరు.. ? టాప్ ఫైవ్‌లో ఎవరి పొజీషన్ ఏంట‌నే ఊహాగానాలు, అంచనాలు తెరపైకి వచ్చాయి.

మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు – 6 సెప్టెంబరు 4న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. గత సీజన్స్ తో పోల్చితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదనేది నిజం. షోకి వస్తున్న దారుణమైన టీఆర్పీ ఇందుకు నిదర్శనం. ఒక సక్సెస్ఫుల్ సీరియల్ కి ఉన్న ఆదరణ కూడా బిగ్ బాస్ వంటి పెద్ద రియాలిటీ షోకి రాకపోవడం నిర్వాహ‌కులు ఊహించని పరిణామం.

 

జయాపజయాల సంగతి పక్కన పెడితే గ్రాండ్ ఫినాలేకి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్ శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు వెళ్ళిపోయింది. మెజారిటీ కంటెస్టెంట్స్ కీర్తిని బయటకు పంపాలని చెప్పారు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం శ్రీసత్య హౌస్ వీడాల్సి వచ్చింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకి ఒకరోజు ముందు సత్య‌ను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ గా కాకుండా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయ‌ని వార్తలు వ‌స్తున్నాయి.

ఈ నేపథ్యంలో అసలు బిగ్ బాస్ సీజన్ సిక్స్ విజేత ఎవరన్న దానిపై హౌస్ మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియన్స్ లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న రాత్రి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తోంది. శ్రీహాన్ రన్నర్ గా నిల‌వ‌నుండ‌గా, టాప్ త్రీలో ఆదిరెడ్డి, ఫోర్త్ పొజిష‌న్‌లో రోహిత్‌, ఇక కీర్తికి ఫిఫ్త్ పొజీషన్ దక్కనుందట.

వీరిలో అత్యధికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్ – 6 విజేతగా నిలవ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా ఓటింగ్‌ను బ‌ట్టి తెలుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉన్నదో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక విన్నర్ కి రూ.50 లక్షల ప్రైజ్ మనీ, 600 గజాల స్థలంతో పాటు.. ఒక కారు బహుమతిగా రానున్నాయి.  దాంతో విన్నర్, రన్నర్ లకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి ఎవరెవరు గెస్టులుగా విచ్చేస్తారో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img