Saturday, July 27, 2024

విద్యుత్ ఉద్యోగిపై సీఐ బూతు పురాణం

Must Read
  • పి..కుం.. లం.. కొ.. అంటూ బెదిరింపు
  • క‌రెంట్ బ‌కాయిలు క‌ట్ట‌మ‌న్నందుకు ఫోన్‌లో వీరంగం
  • మండిప‌డుతున్న విద్యుత్ ఉద్యోగులు
  • సోష‌ల్ మీడియాలో ఆడియో వైర‌ల్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : విద్యుత్ ఉద్యోగిపై ఖ‌మ్మం ఇన్‌స్పెక్ట‌ర్‌ సంప‌త్ బూతు పురాణం అందుకున్నారు. స‌ద‌రు సీఐ భార్య హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హిస్తున్న షాపు క‌రెంట్ బ‌కాయిలు క‌ట్ట‌మ‌న్నందుకు ఫోన్‌లో వీరంగం వేశారు. పి.. కుం.. లం.. కొ.. అంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఇప్పుడు ఆ ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌ద‌రు సీఐ తీరుపై విద్యుత్ ఉద్యోగులు మండిప‌డుతున్నారు. బాధితుడు జేఎల్ఎం యుగంధ‌ర్ తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం… హ‌న్మ‌కొండ టౌన్ డివిజ‌న్ హ‌న్మ‌కొండ చౌర‌స్తా సెక్ష‌న్‌లో జేఎల్ఎంగా కోడెపాక యుగంధ‌ర్ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. హ‌న్మ‌కొండ చౌర‌స్తాలోని సాయికృష్ణ కాంప్లెక్స్‌లోని లేడిస్ ఎంపోరియం షాపుకు సంబంధించిన కరెంటు బిల్లు ( స‌ర్వీస్ నంబ‌ర్ 12285003019) రెండు నెల‌లుగా చెల్లించ‌డం లేదు. షాపు నిర్వాహ‌కులు క‌రెంట్ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో అక్టోబ‌ర్ 20వ తేదీ శుక్ర‌వారం విధుల్లో భాగంగా జేఎల్ఎం యుగంధ‌ర్ తోటి సిబ్బందితో క‌లిసి షాపు క‌రెంట్ క‌ట్ చేశారు. దీంతో షాపు నిర్వాహ‌కురాలు అయిన స్ర‌వంతి సద‌రు జేఎల్ఎం యుగంధ‌ర్‌కు ఫోన్ చేశారు. షాపుకు క‌రెంట్ పునరుద్ధ‌రించండి.. క‌రెంట్ ఇచ్చిన త‌ర్వాత‌ బిల్లు క‌ట్టెస్తా.. అంటూ అన‌డంతో.. ముందుగా బిల్లు క‌ట్టండి.. ఆ త‌ర్వాత క‌రెంట్ ఇస్తాం మేడం.. అంటూ యుగంధ‌ర్ చెప్పారు. ఆ త‌ర్వాత వెంట‌నే ఆమె భ‌ర్త‌.. సంప‌త్ యుగంధ‌ర్‌కు ఫోన్ చేసి.. తాను ఖ‌మ్మం ఇన్‌స్పెక్ట‌ర్‌న‌ని, మాట్లాడ‌డం తెలియ‌దా..? అంటూ ఒక్క‌సారిగా బూతు పురాణం అందుకున్నారు. పి..కుం.. లం.. కొ.. అంటూ ఇష్టారాజ్యంగా తిట్టారు. వ‌రంగ‌ల్‌లో ఎక్క‌డ ఉంటావ్‌రా..! అంటూ బెదిరింపులకు దిగారు. కేవలం క‌రెంట్ బకాయిలు క‌ట్ట‌మ‌న్నందుకు సీఐ సంప‌త్ విద్యుత్ ఉద్యోగిని ఇష్టారాజ్యంగా తిట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఆ ఆడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సీఐ మాట‌ల‌పై విద్యుత్ ఉద్యోగుల సంఘాలు మండిప‌డుతున్నాయి. కాగా, సంప‌త్ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని వ‌ర్ధ‌న్న‌పేట‌, జ‌ఫ‌ర్‌ఘ‌డ్‌, న‌ర్సంపేట‌, కేయూ పీఎస్‌ల‌లో విధులు నిర్వ‌ర్తించారు. ఇక్క‌డి నుంచి హెడ్‌క్వార్ట‌ర్స్‌కు వీఆర్ త‌ర్వాత ఇన్‌స్పెక్ట‌ర్‌గా పదోన్న‌తిపై ఖ‌మ్మం బ‌దిలీ అయ్యారు.

క్షమాప‌ణ కోరిన ఇన్‌స్పెక్ట‌ర్‌
జేఎల్ఎం యుగంధ‌ర్‌పై ప‌రుష‌ప‌ద‌జాలంతో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఖ‌మ్మం ఇన్‌స్పెక్ట‌ర్ సంప‌త్ స్పందించారు. పనిఒత్తిడిలో తొందరపడి మాట్లాడినందుకు ఒక సోదరుడిగా భావించి క్షమించమని హ‌న్మ‌కొండ టౌన్‌ డీఈ, ఏడీఈ, యూనియన్ నాయకులను కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img