అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం మునుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అరెస్టయిన వారి నుంచి పోలీసులు రూ.8,400వేల నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ మీడియాకు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్, పర్వతగిరి ప్రాంతానికి చెందిన రాయపురం సరిత, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలతో కలిసి ఒక ముఠా ఏర్పడ్డారు. సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు.
ఇందులో భాగంగా ఈ ముఠాలో ముగ్గురు కిలాడీ లేడీలు బస్ స్టేషన్లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఒక వెహికల్ ని కిరాయికి తీసుకొని వారి తోపాటు సదరు విటుడుని కూడా ఎక్కించుకొని వరంగల్ నగర పరిసర గ్రామాలలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకు వెళ్తారు. ఆ సమయంలో ఈ ముఠాలోని మహిళలు విజయ్ కుమార్ కు ఫోన్‌లో రహస్యంగా సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న నిందితుడు విజయకుమార్ కిలాడీ లేడీలు ఉన్న ప్రాంతానికి చేరుకొని వారితో ఉన్న యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.
ఇలా ఈ ముఠాపై మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులలో రూ.20 వేల నగదు ఒక సెల్ ఫోను దోపిడీకి గురయ్యాయి. అలాగే గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి రూ.3 వేల నగదు, రూ. 2000 విలువైన ఫోన్ లను బలవంతంగా దోపిడీ చేశారు. పక్కా సమాచారంతో ఈరోజు మామునూరు సీఐ క్రాంతి కుమార్ తన సిబ్బందితో సదరు ముగ్గురు మహిళ నిందితురాళ్ళను రాంగోపాలపురం వద్ద అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ నరేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ క్రాంతికుమార్, ఎస్సై రాజేష్ రెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్ పాషా, రోజులను ఈస్ట్ జోన్ డీసీపీ అభినందించారు.