Saturday, July 27, 2024

యువతి ఫోటోలు మార్ఫింగ్‌.. వ‌రంగ‌ల్ యువ‌కుడి అరెస్టు

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మకొండ క్రైం : యువతి ఫొటోలను ఆశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిని గీసుగొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలను వెల్ల‌డించారు.వరంగల్ కోట మండలం, దూబకుంట గ్రామానికి చెందిన జన్ను విజయకుమార్ (27), ఏడాదికాలంగా అదే గ్రామానికి చెందిన యువతితో ఫోన్‌లో చాటింగ్ చేసేవాడు. ఈ చాటింగ్ వ్యవహారం సదరు యువతి అక్క (బాధితురాలు) దృష్టికి రావడంతో నిందితుడిని యువతి అక్క మందలించింది. అక్కపై కక్షగట్టిన నిందితుడు ఆమె పరువు తీయాలకున్నాడు. దీనితో నిందితుడు అశ్లీల రీతిలో మార్ఫింగ్ చేసిన బాధితురాలి ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లను బాధితురాలి ఫోన్‌కు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించేవాడు. దీనితో బాధితురాలు గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం సహకారంతో చేపట్టిన దర్యాప్తులో గీసుగొండ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసారు.
ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యకరం ప్రవర్తించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామ‌ని డీసీపీ హెచ్చరించారు. నిందితుడిని గుర్తించడంతో ప్రతిభ కనబరిచిన గీసుగొండ ఇన్స్స్పెక్టర్ సట్లరాజు, సైబర్ క్రైం ఇన్‌స్పెక్ట‌ర్ జ‌నార్ద‌న్‌రెడ్డి, ఎస్ఐ వెంకన్న కానిస్టేబుళ్లు కిషోర్, సంపత్‌ల‌ను ఈస్ట్ జోన్ డీసీపీ అభినందించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img