Monday, September 9, 2024

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బ‌దిలీలు

Must Read

31 మందికి స్థానచలనం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్‌ అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. అదేవిధంగా యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్‌ ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్‌ జైన్‌, సెర్ప్‌ సీఈవోగా పాట్రు గౌతమ్‌, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్‌ నికోలస్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా మంద మకరందు, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్‌ ఖాన్‌, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా కే. నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహ శబారిష్‌, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్‌ ధోత్రే నియమితులయ్యారు. అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న కే స్వర్ణలతను జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్‌ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మను చౌదరిని, టీఎస్‌ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్‌గా నియ‌మించారు. 2018 సివిల్స్ టాప‌ర్‌గా ఉన్న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం క‌లెక్ట‌ర్‌ అనుదీప్‌ దురిశెట్టిని హైదరాబాద్‌ కలెక్టర్‌గా నియమించారు. నాగర్‌ కర్నూల్‌ అదనపు కలెక్టర్‌గా కుమార్‌ దీపక్‌, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్‌, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్‌, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్‌ నియమితులయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img