అక్షరశక్తి, వరంగల్ : మానసిక శాంతి కోసం ఉచిత రాజయోగ తరగతులు నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారీల వరంగల్ జోన్ ఇన్‌చార్జి బీకే సబిత, బీకే విమల, బీకే వైష్ణవి, బీకే శ్రీలత, ములుగుశాఖ ఇన్‌చార్జి బీకే వసంత ఒక ప్రకటనలో తెలిపారు. శారీరక, మానసికోల్లాసానికి రాజయోగ తరగతులు ఎంతగానో ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు. ఈమేరకు మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు అవగాహన కల్పించేలా పెద్దఎత్తున కరపత్రాలతో ప్రచారం చేపట్టారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.pamplet final (1)