అక్షరశక్తి, పరకాల: పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం అధికారులు, కౌన్సిలర్లు తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల పట్టణ అభివృద్ధి పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ, ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి కి అడ్వాన్స్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ. మున్సిపల్ వైస్ చైర్మన్ రేగురి విజయ పాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఆర్పి జయంత్ లాల్, ఏకు రాజు, శనిగరపు రజిని, మడికొండ సంపత్, మున్సిపల్ కమిషనర్ నరసింహ మరియు సిబ్బంది పాల్గొన్నారు.