అక్షరశక్తి, కొత్తగూడ: కొతగూడ మండలం గుంజేడు గ్రామంలో గత పది రోజుల క్రితం చనిపోయిన చిదరబోయిన ముత్తమ్మ పార్టీ కి చేసిన సేవలు చాలా గొప్పవని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ ప్రాంతంలో విప్లవోద్యమంలో ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్న చిదరబోయిన పాపయ్యకు అండగా నిలబడి కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా ముత్తమ్మ నెరవేర్చారని అన్నారు. ఉమ్మడి కొత్తగూడా మండలంలో సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల అభివృద్ధికోసం, ఆర్థికంగా బలోపేతం అవటం కోసం పార్టీకి చేసిన సేవలు, త్యాగాలు చాలా గొప్పవని అన్నారు. మాటలు చెబుతూ కాలం గడుపుతున్న పాలకుల విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పేదలకు అండగా నిలబడేది ఎర్రజెండా మాత్రమేనని రవి అన్నారు. ఈ క్రమంలో ముత్తమ్మ లాంటి ఎందరో కార్యకర్తలు, నాయకులసేవలను పార్టీ వినియోగించుకుందని ఆమె చేసిన సేవలకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని రవి ప్రకటించారు. సీనియర్ నాయకుడు గొంది సమ్మయ్య అధ్యక్ష వహించగా పూనం ప్రభాకర్ మునుకూరు జగ్గన్న తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెంకన్న, లక్షమ్య రాజు, వెంకన్న, శ్రీను, వెంకటమ్మ తో పాటుగా వివిధ గ్రామాల నుండి హాజరైన పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.