అక్షరశక్తి, కాజీపేట: కాజీపేట లోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో స్పోర్ట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జోనల్ డిజిఎం. రిజ్వానా ఆర్ & డి సంగీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిఎం రిజ్వానా మేడమ్ మాట్లాడుతూ.. ఒలంపిక్ క్రీడలలో హాకీ లో దేశానికి వరుసగా మూడు సార్లు బంగారు పతకాలు అందించిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని అలాగే విద్యార్ధులు చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించాలని అన్నారు. అనంతరం కిడ్స్, చాంప్స్ పిల్లలకు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ములు పోజు శ్రీనివాసాచారి, జోనల్ కో ఆర్డినేటర్‌లు సాయికృష్ణ, హారిక, శిరీష, వైస్ ప్రిన్సిపాల్‌లు నాగమణి, మౌనిక, పిఇటి. ఘనశ్యాం, ఎఒ. కపిల్ తదితరులు పాల్గొన్నారు.