ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మరియు సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ బస్టాండ్,మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు నిలవకుండా ప్రజలుకు ఇబ్బందులు ఎదురవ్వకుండా శాశ్వత పరిష్కారం చేయాలని అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సైడ్ డ్రెన్, రోడ్డు లేకుండా ఉన్నాయని వాటిని గుర్తించి నిర్మించడానికి దృష్టి సారించాలని తెలిపారు. పట్టణంలో కుక్కల, కోతుల బెడద ఉండకుండా చూడాలని అన్నారు. వాటితో పాటు వీధి దీపాలు, ప్రతి వార్డులో సురక్షిత త్రాగునీరు అందేలా కృషి చేయాలని పారిశుద్ధ పనులను మెరుగుపరిచి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని లోతట్టు ప్రాంతాలను గుర్తించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తెలిపారు.