తెలంగాణ, ఏపీలోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌర హక్కుల సంఘం నేతలు, అమరుల బంధు మిత్రుల సంఘంతోపాటు చైతన్య మహిళా సంఘం నాయ కుల ఇండ్లలో సోమవారం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ, సంఘాలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగంతో ఈ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆ ల్వాల్‌లోగల న్యాయవాది సురేశ్, భవాని ఇండ్లతోపాటు నెల్లూరు, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు.
వరంగల్‌లో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎన్ఐఏ సోదాలు కలకలంరేపాయి. వరంగల్ హంటర్ రోడ్డులో చైతన్య మహిళా సంఘం సభ్యులు అనిత, శాంతమ్మ ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయిలో నలుగురు నక్సలైట్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించగా వరంగల్ నగరంలో త లదాడుచున్నట్లు చెప్పారు. పైడిపల్లి గ్రామంలోని జన్ను శాంతమ్మ ఇంట్లో ఉన్నామని వెల్లడిచడంతో ఆమె ఇంటితోపాటు హంటర్ రోడ్‌లో గల అనిత నివాసంలో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సింది.