అక్షరశక్తి, వరంగల్, 19 ఆగస్టు 2024 : ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలను శీఘ్రగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద డిఆర్డిఓ కౌసల్యాదేవి, జడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆర్డీఓ కృష్ణ వేణిలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేస్తూ మానవతా దృక్పథంతో త్వరితంగా పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించుటకు వీలులేని పక్షంలో దరఖాస్తు దారుడికి అర్ధమయ్యే విధంగా వివరించి అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియచేయాలని కలెక్టర్ అన్నారు. నేటి ప్రజావాణిలో దరఖాస్తులు మొత్తం 19 రాగా అందులో 7 వినతులు రెవెన్యూ సమస్యలకు, మిగిలిన వివిధ శాఖల కు సంబంధించిన వినతులు వచ్చాయి. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి లో స్వీకరించిన దరఖాస్తులను ప్రజావాణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పంపించడం జరుగుతున్నదని, వాటిని పెండింగులో ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఆర్జీలను వేగంగా పరిష్కరించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
Must Read