అక్షరశక్తి, హనుమకొండ: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యల కు అధిక ప్రాధాన్యత నిచ్చి తరితగతను పరిష్కారం చూపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 15 దరఖాస్తు లను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గణేష్,పరకాల ఆర్డిఓ నారాయణ మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.