Saturday, July 27, 2024

వైజాగ్‌లో రామ్ చరణ్ హంగామా.. వీడియో వైరల్

Must Read

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య ప్లాప్ త‌ర్వాత చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ సినిమా ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా జరుగుతుంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాకు లీకుల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలుమార్లు చరణ్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజమండ్రిలో షూటింగ్ లొకేషన్ నుంచి చరణ్ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో చరణ్ వైజాగ్‌లో నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ ముందే నానా హంగామా చేస్తున్నాడు. పక్కనే ఉన్న బోర్డ్స్ లాగి పడేసి వీరంగం చేస్తున్నాడు. తాజాగా విడుదలైన వీడియోలో చరణ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.. రెడ్ టీ షర్ట్ పై బ్లాక్ జాకెట్ వేసుకుని స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img