అక్షరశక్తి, హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రం పనులను నిర్ణీత గడవలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతి నిధులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను కలెక్టర్ జి డబ్ల్యు ఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు జరుగుతున్న కాళోజి కళాక్షేత్రంలోని పెయింటింగ్, టైల్స్ ఏర్పాట్లు, ఎలక్ట్రికల్, ప్లంబర్, ఆడిటోరియం, తదితర పనులను కలెక్టర్ పరిశీలించి వాటికి సంబంధించిన పనుల పురోగతిని అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కువ మంది కూలీలను నియమించి పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ భీమ్రావు, కు డా పిఓ అజిత్ రెడ్డి సంబంధిత అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.