Monday, September 9, 2024

అల్లుడిని కొట్టి చంపిన అత్త‌మామ‌

Must Read

కొత్తగూడ మండలంలో విషాదం
అక్ష‌ర‌శ‌క్తి, కొత్తగూడ: కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల‌తో అత్తింటి వారి దాడిలో అల్లుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికుల క‌థ‌నం మేర‌కు… మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు అల్లుడిపై దాడి చేశారు. ఈ ఘటనలోఐరెండ్ల యాదగిరి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. యాదగిరికి అదే గ్రామానికి చెందిన రాసాల సోమయ్య-సమ్మక్క కూతురు రాసాల స్వప్నతో వివాహం జ‌రిగింది. కొద్ది రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. తరువాత అత్తగారింటి తరపు నుంచి నిత్యం గొడ‌వ‌లు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే శుక్రవారంరాత్రి ఘ‌ర్ష‌ణ జరిగింది. దీంతో అత్త, మామ దాడి చేయగా యాదగిరి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img