అక్షరశక్తి, వరంగల్ తూర్పు : వరంగల్ తూర్పు నియోజకవర్గం శివనగర్ 34, 35 డివిజన్లకు చెందిన పలువురితోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ శామంతుల ఉషశ్రీనివాస్ శుక్రవారం మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శివనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… వరంగల్ తూర్పులో అభివృద్ధి ఎం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారని, తాము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, కాంగ్రెస ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరాటే ప్రభాకర్, కొత్తపల్లి శ్రీనివాస్, గజ్జెల లింగమూర్తి, బిల్లా డాక్టర్ వెంకన్న, పట్టూరి సుధాకర్, గణిపాక అంజమ్మ, రాజమణి, సుజాత, తొగరు రాధిక, లావణ్య, లక్ష్మి, శామంతుల కిరణ్, వినోద్, కృష్ణ, విజయ్, శ్రీధర్ కార్యకర్తలు పాల్గొన్నారు.