Wednesday, June 19, 2024

మన శివనగర్ పెంచి పోషించిన బిడ్డను నేను

Must Read

– మీ ఆపతి సంపతిలో అండ‌గా ఉన్నా..
– ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ల‌ను ఎన్నుకుంటే ఆగమైతం..
-నేను లోక‌ల్‌.. ఆపదొస్తే అండర్ బ్రిడ్జ్ దగ్గ‌రే ఉంటా ..
– ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
– 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బీఆర్ఎస్ లో చేరిక

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : మ‌న శివ‌న‌గ‌ర్ పెంచి పోషించిన బిడ్డ‌ను నేను.. మీ ఆప‌తిసంప‌తిలో నేనున్నా.. ఎక్క‌డి నుంచో వ‌చ్చిన వాళ్ల‌ను ఎన్నుకుంటే ఆగ‌మైతం.. వ‌రంగ‌ల్ వ‌ద్ద‌ని పోయిన వాళ్లు, గూండాయిజం చేసేవాళ్లు మ‌న‌కు అవ‌స‌ర‌మా..? ఆప‌దొస్తే.. అండ‌ర్ బ్రిడ్జి ద‌గ్గ‌రే నేనుంటా.. అంటూ వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి న‌న్న‌పునేని న‌రేంద‌ర్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తూర్పులో త‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం
శివనగర్ కేపీఎస్‌ ఫంక్షన్ హాల్‌లో మర్రి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మెరుగు అశోక్, సీనియర్ నాయకులు గడ్డం రవితో పాటు సుమారు 80కుటుంబాలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో కేసులపాలైనం,లాఠీ దెబ్బలు తిని నేటి వరకు నికార్సుగా వరంగల్ తూర్పు ప్రజలకోసం నిలబడ్డాన‌ని, కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేగా త‌న‌కు తోడ్పాటునందించింది ఈ శివనగర్ అని అన్నారు. నియోజకవర్గంలో శివనగర్‌ను రోల్ మోడల్ గా మార్చామ‌ని అన్నారు. వరద ముంపు గురికాకుండా అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణానికి ఇండ్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే నేను దగ్గరుండి భారం ఎక్కువైన పర్వాలేదు అని డిసైన్ మార్చి ఇల్లు కులకొట్టకుండా వరద నీరు పోయే విదంగా ఏర్పాటు చేసాం. గుడిసె వాసులకు పట్టాలను అందించడమే ద్యేయంగా గుడిసెవాసుల కోసం సిపిఎం నుండి మన పార్టీలోకి వచ్చిన వాళ్ల‌ని ముందుంచి ఉచిత దరఖాస్తు కేంద్రం ఏర్పాటు చేసి పట్టాలను అందించాం.. అని న‌రేంద‌ర్ అన్నారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 4100 కోట్ల నిధులు తీసుకొచ్చి నూతన కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 1250కోట్లతో 24 అంతస్థుల హాస్పిటల్
మన తూర్పు నియోజకవర్గాన 2200వందల డబల్ బెడ్ రూమ్ నిర్మించాము ఎన్నికలు అవ్వగానే అందిస్తాం,గృహాలక్ష్మి,దళిత బంధు,బిసి బంధు,మైనారిటీ బంధు అన్ని సాంక్షన్ అయినయ్ ఎన్నికలు అవ్వగానే అందిస్తాం.. అని అన్నారు. ఇక్కడ పోటీ చేసే బీజేపీ అభ్యర్థి వరంగల్ ప్రజలను చిల్ల‌ర‌గాళ్లు అని, కాంగ్రెస్ అభ్యర్థి వరంగల్ తూర్పు లో పోటీ చేసి తప్పు చేశానని అంటున్నారని, మనపై విషం చిమ్మే ఈ నాయకులు మనకు అవరసరమా ఆలోచించండి.. అని న‌రేంద‌ర్ అన్నారు. ప్రజల పండుగ పబ్బాల్లో నేనుంటా…ఆపటి సంపతిలో నేనుంటా నేను పక్కా లోకల్ ఆశీర్వదించండి అండగా ఉంటా.. అని భ‌రోసా ఇచ్చారు. పార్టీలో చేరిన మెరుగు అశోక్, గడ్డం రవికి సముచిత స్థానం కలిస్తామ‌ని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాన‌ని అన‌నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img