Saturday, July 27, 2024

అయ్యా సీఎం గారు.. శిక్షణకు పంపరా మమ్ములను..

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరిగాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజిపి అలాగే బోర్డు చైర్మన్ పరిధిలో విచారణ కమిటీ నిర్వహించుకొని పీసీ అభ్యర్థులు అటేస్టేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిఘావిభాగం నుండి పంపబడిన అభ్యర్థుల వ్యక్తిగత విచారణ నివేదికలను పరిశీలించి. రాష్ట్రవ్యాప్తంగా 158 మంది పిసి అభ్యర్థులకు క్లియరెన్స్ జారీచేస్తూ రాష్ట్ర పోలీస్ బోర్డు శాఖ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా టిఎస్ఎస్పి విభాగం నుండి పీసీ 80 మంది అభ్యర్థులను తక్షణమే పోలీస్ శిక్షణకు అనుమతించిది. కానీ లా అండ్ అడ్డర్ కి ఊపయోగ పడే సివిల్ 34 ఏఆర్ 31 ఎస్పిఎఫ్ 3 మొత్తం కలిపి 67 మంది పీసీ అభ్యర్థులను పోలీస్ బోర్డ్ ఉత్తర్వులకు అనుగుణంగా శిక్షణకు అనుమతించకపోవడం చాలా బాధగా ఉంది.విచారణలో భాగంగా అర్హులైన పీసీ అభ్యర్థులను శిక్షణకు అనుమతించాలని కోరుతున్నారు. కేసుల విచారణ పూర్తయ్యాక పీసీ అభ్యర్థుల శిక్షణపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నందున ఈనెల 27న పీసి అభ్యర్థులు డీజీపి కార్యాలయంలో ఆర్జి పెట్టుకున్నారు.కానీ వారు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం అభ్యర్థులను నిరాశకు గురిచేస్తుంది.అన్ని రకాల విచారణలు పూర్తై క్లియరెన్స్ పొందినప్పటికీ శిక్షణకు అనుమతించడంలో జాప్యం జరుగుతున్నందున పీసీ అభ్యర్థులు కుటుంబాలు కన్నీరు మున్నేరు అవుతూoది ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని వారికన్నా కళలను నెరవేర్చాలని వేడుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా అమ్మాయిలు సహితం ఉద్యోగ శిక్షణకు అనుమతించాలని చేస్తున్న పొరుబాటలో భాగంగా న్యాయం జరిగేలా సహకారం అందించాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ అడిషనల్ డీజీ శ్రీనివాసరావును వారు మోరపెట్టుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img