అక్షరశక్తి, వరంగల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు గురువారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే తన సహచరులు, అనుచరులతోపాటు వివిధ వర్గాల వారితో సంప్రదింపులు జరిపిన అశోక్ వారి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీలోకి రావడం మూలంగా పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి వరంగల్ జిల్లాలో ఇప్పుడు గాజర్ల అశోక్ కాంగ్రెస్ చేరడం సంచలనంగా మారింది.