Saturday, July 27, 2024

మానుకోట నుంచి శేఖ‌ర్‌నాయ‌క్‌!

Must Read
  • బీఎస్పీ అభ్య‌ర్థిగా బ‌రిలో..?
  • విదేశాల్లో చ‌దువు.. ఉన్న‌త విద్యావంతుడిగా గుర్తింపు
  • బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా ముంద‌డుగు
  • రెండేళ్లుగా పార్టీ బ‌లోపేతం కృషి
  • నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేయ‌డంతో అన్ని రాజ‌కీయ పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటే దిశ‌గా బీఎస్పీ అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే పోటీ చేసే స్థానాల‌కు ప్ర‌క‌టించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌.. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంపై ముమ్మ‌ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా మ‌హ‌బూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసే అభ్య‌ర్థి విష‌యంలోనూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. విదేశాల్లో చ‌దువుకుని, రెండేళ్లుగా పార్టీ బ‌లోపేతం కోసం ప‌నిచేస్తున్న గుగులోత్ శేఖ‌ర్‌నాయ‌క్‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు అంద‌డంతో ప్ర‌స్తుతం మ‌హబూబాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్న శేఖ‌ర్ నాయ‌క్‌.. బ‌రిలో దిగేందుకు సంసిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులంద‌రినీ క‌లుపుకుంటూ.. స‌మ‌న్వ‌యంతో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. బ‌హుజ‌న రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో మానుకోట‌లో బీఎస్పీ స‌త్తా చాటుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

విదేశాల్లో ఉన్న‌త చ‌దువు..
గుగులోత్ శేఖ‌ర్‌నాయ‌క్ స్వ‌గ్రామం మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నెల్లికుదురు మండ‌లం జామ తండా. సామాన్య వ్య‌వ‌సాయ కుటుంబం. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు నెల్లికుదురు హైస్కూల్ చ‌దువుకున్నారు. అనంత‌రం మానుకోట‌లో ఒకేష‌న‌ల్ కోర్సు, ఆ త‌ర్వాత హోట‌ల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. అక్క‌డి నుంచి 2019లో ఉన్న‌త చ‌దువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లారు. చ‌దువుకుంటూనే ఉన్న‌త ఉద్యోగం సంపాదించారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న సంక‌ల్పంతో 2021లో తిరిగి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో రెండేళ్ల క్రితం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ ఆధ్వర్యంలో 100 మందితో బహుజనుల సంకల్ప సభలో డాక్ట‌ర్ ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీతోనే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కంతో శేఖ‌ర్‌నాయ‌క్ ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హ‌బూబాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్న ఆయ‌న‌.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాయ‌కులంద‌రినీ క‌లుపుకుంటూ గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ.. ప‌ట్టుసాధించే దిశ‌గా ముందుకు వెళ్తున్నారు. అలాగే, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తోనూ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధానంగా నిరుపేద విద్యార్థుల‌ను ద‌త్త‌త తీసుకుని చ‌దివిస్తున్నారు.

బీఎస్పీలో భారీగా చేరిక‌లు
మహబూబాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ కేంద్రంలో అసెంబ్లీ ఇంచార్జ్ గుగులోత్ శేఖర్ నాయక్ ఆధ్వర్యంలో బీఎస్పీ అసెంబ్లీ కార్యలయం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శనిగపురం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. అంతేగాకుండా, ఇటీవ‌ల గుగులోత్ శేఖర్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 100మంది మహబూబాబాద్, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాలకు చెందిన యువకులు పలు వాహనాల్లో వెళ్లి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, మహబూబాబాద్ అసెంబ్లీ స్పెషల్ ఇంచార్జ్ దార్ల శివరాజ్, జిల్లా ఇంచార్జ్ దార ప్రసాద్‌రావు, జిల్లా అధ్యక్షులు ఇసంపెల్లి ఉపేందర్, జిల్లా కోశాధికారి జింక లక్ష్మణ్, జిల్లా ఈసీ మెంబర్లు తప్పేట్ల చాణక్య, ఎడ్ల శ్రీను, జిల్లా నాయకులు పాల్వాయి బుచ్చి రాములు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రేవంత్ నాయక్, ప్రధాన కార్యదర్శి ఉబ్బపెల్లి శ్రావణ్, నెల్లికుదురు మండలం అధ్యక్షులు వెంకన్న, గులగట్టు హేమంత్, గుజ్జునూరి నరేష్, సాగర్, విష్ణు సందీప్, రాజేష్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img