Tuesday, June 18, 2024

హ‌న్మ‌కొండ‌లో దారుణం.. అన్నను నరికి చంపిన తమ్ముడు…కార‌ణం అదేనా..?

Must Read

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : హ‌న్మ‌కొండ‌లో దారుణం జ‌రిగింది. క్ష‌ణికావేశంలో అన్న‌ను త‌మ్ముడు న‌రికి చంపిన ఘ‌ట‌న కుమార్‌ప‌ల్లిలో చోటుచేసుకుంది. కుమార్‌ప‌ల్లిలోని బుద్ధ‌భ‌వ‌న్ వ‌ద్ద శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో గొర్రె శంక‌ర్‌, గొర్రె రాజ్‌కుమార్‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దీంతో అన్న గొర్రె శంకర్‌ను తమ్ముడు గొర్రె రాజ్ కుమార్ గొడ్డలితో న‌రికి దారుణంగా హ‌త్య‌చేశాడు. కాగా అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ అవివాహితుల‌ని, త‌మ్ముడు వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుండ‌టంతో అన్న మందలించాడ‌ని.. ఈక్ర‌మంలోనే కోపంతో అన్న‌ను తమ్ముడు హ‌త్య చేశాడ‌ని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img