Friday, September 13, 2024

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం వేళ‌.. రేపు వ‌రంగ‌ల్ ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Must Read

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వినాయక నిమజ్జనం పురస్కరించుకొని వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జ‌నానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపటి రోజు అనగా 27-09-2023 మధ్యాహ్నం 02.00 నుండి మరుసటి రోజు తేది 28-09-2023 ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లీంపులు, ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

భారీ వాహనాలకు ట్రాఫిక్ మ‌ళ్లింపు ఆంక్షలు

1. ములుగు, భూపాలపల్లి వైపు నుండి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన భారీ వాహనాలు ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్లాలి. భూపాలపల్లి, పరకాల నుండి ఖమ్మం వెళ్లాల్సిన వాహ‌నాలు ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్లాలి.

2. భూపాలపల్లి, పరకాల నుండి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్లాల్సిన‌వి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు, గొర్రెకుంట వెళ్లాలి.

3. సిటీలోపలికి వచ్చు భారీ వాహనాలు సిటీ అవతల ఆపుకోవలెను. నిమజ్జన సమయంలో ఎలాంటి వాహనాలు సిటీలోపలికి అనుమతించబడవు. వరంగల్ నగరంలో తిరుగు అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు ఆమలవుతాయి.

4. ములుగు, పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కెయుసి, సి.పి.ఓ. అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

5. హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సి.పి.ఓ నుంచి కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

6. హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లు బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలి.

7. వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలి.

వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు

8. సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేసిన త‌ర్వాత‌ వాహనాలు శాయంపేట వైపు వెళ్ళే రోడ్డు ద్వారా వెళ్లాలి. 6 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలతో కూడిన వాహనాలు, వినాయక విగ్రహాలతో కూడిన లారీలు సిద్దేశ్వర గుండంలో నిమజ్జనంకు అనుమతించబడవు. ఇట్టి వినాయక విగ్రహ వాహనాలు నిమజ్జనం గురించి కోట చెరువు, చిన్న వడ్డేపల్లి చెరువులకు వెళ్లాలి.

9. శాయంపేట వైపు నుండి వచ్చు వినాయక విగ్రహా వాహనాలు వయా హంటర్ రోడ్, అదాలత్, హన్మకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించవలెను.

10. కోట చెరువు వైపు నిమజ్జనం కోసం వెళ్లే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, ఎంజీఎం ఆటోనగర్ మీదుగా కోటచెరువుకు వెళ్లాలి.

11. ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుండి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయాలి.

12. చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్ నుండి నర్సంపేట రోడ్ వైపునకు వెళ్లాలి.

13. కోట చెరువులో వినాయక విగ్రహ నిమజ్జన అనంతరం వాహనాలు హనుమాన్ జంక్షన్ , పెద్దమ్మగడ్డ నుండి కేయూసి జంక్షన్ మీదగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ మేర‌కు వాహనదారులు, గణేష్ నవరాత్రి మండప నిర్వాహకులు పోలీసుల సూచనలను పాటిస్తూ గణేష్ శోభా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img