Monday, September 9, 2024

టెట్ ఫలితాలు వ‌చ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్ చెక్ చేసుకోండి

Must Read

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్- 2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ లితాలు చెక్‌ చేసుకోవచ్చు. సెప్టెంబరు 20న టెట్‌ ప్రాథమిక కీ విడుదల అయిన సంగతి తెలిసిందే. అ భ్యర్థుల నుంచి సెప్టెంబరు 23 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. సెప్టెంబరు 27న అంటే (బుధ‌వారం) తుది ఆన్సర్‌ కీతో పాటు ఫలితాలను కూడా విడుదల చేశారు. టెట్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ వెబ్‌సైట్‌లోకి మీ పరీక్ష వివరాలను చెక్ చేసుకోవచ్చు.

కాగా తెలంగాణ టెట్‌ అర్హత కాల పరిమితి జీవిత కాలం ఉంటుంది. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులు అవుతారు. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. మరో వై పు తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img