వర్దన్నపేట కాంగ్రెస్ ముఖ్య నాయకులు
అక్షరశక్తి, కాజీపేట : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్‌ను డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డికే ఇవ్వాలని వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాజీపేటలోని మీడియాలో పాయింట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేసి నియోజకవర్గం వదిలిపెట్టి పోయిన తర్వాత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ కార్పొరేషన్ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో జంగా రాఘవరెడ్డి ముందుండి నడిపించారని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటూ గెలిపించారి పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న రాఘవరెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమ నాయకుడు రాఘవరెడ్డికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని, అందరం కలిసి గెలిపించుకుంటామని, టికెట్ ఇవ్వని పక్షంలో రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకడుగు వేయబోమని కాంగ్రెస్ అధిష్ఠానానికి స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో కాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, హసన్‌పర్తి మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర రమేష్, పీఏసీఎస్ డైరెక్టర్ లింగం నరేందర్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, 46వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ వస్కుల శంకర్, 64 డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ లింగమూర్తి, 44వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాజారపు స్వామి, మాజీ సర్పంచ్ జక్కుల సారయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రమేష్, డివిజన్ అధ్యక్షులు, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.