అక్షరశక్తి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనమైంది. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు.. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యూలర్ పార్టీ. దేశ పునాదుల నుండి నిర్మాణం వరకు కాంగ్రెస్ హస్తం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని వైయస్ఆర్ చివరి కోరిక. ఆయన కోరిక నిజం చేసేందుకు కృషి చేస్తాం… అంటూ షర్మిల అన్నారు.