Tuesday, June 25, 2024

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌ షాక్

Must Read
  • కాంగ్రెస్ పార్టీలోకి ఆరుగురు గులాబీ కార్పొరేట‌ర్లు
    అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కార్పొరేట‌ర్లతోపాటు ప‌లువురు మాజీ కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అనంత‌రం సీఎం రేవంత్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసారు.

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 7వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ వేముల శ్రీనివాస్, 49వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ మానస ప్రసాద్, 50వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ నెక్కొండ కవిత కిషన్, 9వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ చీకటి శారద ఆనంద్, 48వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ షార్జా బేగం, 31వ డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ మామిండ్ల రాజయ్య యాదవ్, మాజీ కార్పొరేటర్లు వీరగంటి రవీందర్ స్వామి చరణ్, తాడిశెట్టి విద్యాసాగర్, వేల్పుల మోహన్ రావు, గోల్కొండ రాంబాబు, మైసారపు సిరిల్ లారెన్స్, సిల్వేరు విజయ్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు పోగుల శ్రీనివాస్, నలుబొల సతీష్ తదితరులు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు తోట వెంకన్న జక్కుల రవీందర్ యాదవ్ పోతుల శ్రీమాన్ సయ్యద్ విజయశ్రీ రజాలి, బంక సరళ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img