Thursday, September 19, 2024

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Must Read

తల్లిపాలే బిడ్డకు సురక్షితమని, తల్లికి కూడా మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు.

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: బుధవారం తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జిల్లా సంక్షేమ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ శిశువు పుట్టిన గంటలోనే తల్లికి మురళి పాలు వస్తాయని వాటిని శిశువుకు పట్టిస్తే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాల వారోత్సవాలు ముగింపు సందర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీసు నుండి సి కె ఏం ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ టీచర్స, ఆశ ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి కి చేరుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ సికేఎం వరంగల్ హాస్పటల్ తల్లుల వర్డ్ సందర్శించారు. కలెక్టర్ తల్లులతో ముచ్చటిస్తూ , తల్లులందరిని “మీ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టరా అని అడిగి తెలుసుకున్నారు. సీజరియన్ ఆపరేషన్ జరిగిన తల్లు కూడా గంట లోపు పాలు పెట్టాము ఆని చెప్పడం తో డాక్టర్, స్టాఫ్ ను కలెక్టర్ అభినందించారు. అనతరం ఆసుపత్రిలో కలెక్టర్ చేతుల మీదుగా పుట్టిన పిల్లలకు బట్టలు అందజేస్తూ బిడ్డకి కేవలం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత కూడా చాలా అవసరమని, తల్లులు మంచి ఆహారము తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘక్షేమ అధికారి హైమవతి, జిల్లా.వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, ప్రాజెక్టు సి డి పి ఓ విద్య సూపర్వైజర్లు బత్తిని రమాదేవి, వెంకటేశ్వరి, ఆశ, ఛాయా, కళ్యాణి, రమా, మాధవి, లావణ్య ,పద్మావతి, డిసి కార్తీక్, బిసి జోష్నా, ఏఎన్ఎం , అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img