అక్షరశక్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితోపాటు అభిలాష బిస్త్, సౌమ్య మిశ్రా, షికా గోయల్‌ను డీజీపీలుగా ప్రమోట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, సీఐడీ చీఫ్ షికా గోయల్ పనిచేస్తున్నారు. వారు అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు.