Thursday, September 19, 2024

పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

Must Read

అక్ష‌ర‌శక్తి కేయూ: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో రెగ్యులర్ బడ్జెట్ సాంక్షన్ అగైనెస్ట్ వెకెంట్ పోస్టులలో 16 పిరియళ్ల వర్క్ లోడ్ తో పని చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రమోషన్ ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ నరేందర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవోజి నాయక్ లు యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఎలాంటి వేతన బెనిఫిట్ జరగలేదు. జీవో నెంబర్ 11 అనేది 2018లో ఇచ్చినా ఇప్పటివరకు పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయలేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని వివిధ రూపాల్లో ఉద్యమించినప్పటికీ ప్రభుత్వ అనుమతి కావాలనే సాకుతో యూనివర్సిటీ అధికారులు కన్వర్షన్ చేయకుండా పార్ట్ టైం అధ్యాపకులకు అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమే బడ్జెట్ సాంక్షన్ పోస్టులకు బడ్జెట్ ఇస్తుంటే యూనివర్సిటీ అధికారులు ఎందుకు కన్వర్షన్ చేయటం లేదని ప్రశ్నించారు. కాబట్టి ఇప్పటికైనా రెగ్యులర్ పోస్టులలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని విశ్వవిద్యాలయం అధికారులకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ తిరునాహరి శేషు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రశాంత్ డాక్టర్, డి బాలకృష్ణ, డాక్టర్ బక్కి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img