అక్షరశక్తి మహబూబాబాద్: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు ఆహ్లాద్దకరంగా ఉంచుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పోలీస్ సబ్సిడరీ కాంటీన్ ను సందర్శించారు. పోలీస్ సబ్సిడరీ కాంటీన్ లొ తక్కువ ధరకు లభించే నిత్యావసరాల వస్తువులు పోలీస్ సిబ్బంది ఉపయోగించుకోవాలి అన్నారు. పక్కనే ఉన్న పోలీస్ మినరల్ వాటర్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం స్టేషన్లోని రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సంధర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం వారికి వెంటనే రసీదు అందించాలని ఎఫ్ ఐ ఆర్ ను నిష్పక్షపాతంగా నమోదు చేయాలని రిసెప్షన్ డ్యూటీస్ లో ఫిర్యాదుదారుని పట్ల మర్యాదగా ప్రవర్తించాలని పోలీస్ స్టేషన్‌కు వస్తే న్యాయం చేకూరుతుంది అనే విధంగా పని చేయాలనీ తెలియచేసారు. నేర పరిశోధనలో ఇన్వెస్టిగేటివ్ అధికారి సాక్షాధారాలను సేకరించడంలో నైపుణ్యంగా వ్యవహరించాలని, గ్రామంలో గల ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ అధికారికి తెలియ చేయాలనీ భాధిత వ్యక్తులు ఫిర్యాదు నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వస్తే వారి సమస్యను విని వారికి న్యాయం చేస్తాం అనే నమ్మకం కలిగేలా ప్రవర్తించాలని ఎస్పీ తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ఆవరనలో గల నమోదు కాబడని మరియు వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని క్రమశిక్షణ తో విధులు నిర్వహించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ సీఐ సరవయ్య, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూరల్ ఎస్.ఐ దీపిక,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.