Thursday, September 19, 2024

రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచిన కాంగ్రెస్

Must Read

– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
-రైతుబంధుకు రాం..రాం..

అక్షరశక్తి, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఐఓబీ బ్యాంక్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి స్వయానా వెళ్లి తమ శాఖ రుణమాఫీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్‌ పరిధిలో 600 మంది రైతులు 6 కోట్ల రూపాయల రుణం తీసుకుంటే కేవలం 200 మంది రైతులకే కోటి 30 లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ అమలు అయ్యిందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్‌కి ఫోన్ చేసి పర్వతగిరి మండల రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన కలెక్టర్‌కి విన్నపించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతన్నలను మోసగించడం తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయలేదని అన్నారు. రైతుబంధుకు రాం..రాం.. చెప్పి రైతు రుణమాఫీ పేరుతో అనేక ఆంక్షలు విధించి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతన్నలకు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటకో మాట, పూటకో మాట రోజుకో మాట మాట్లాడుతూ.. ప్రజా పాలన పేరుతో హామీలు ఇచ్చి రైతులను, ప్రజలను, సబ్బండ వర్గాలను మోసగిస్తున్నాడని అన్నారు. కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు తలా తోక లేకుండా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేస్తున్నారని దుయ్యబడ్డారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు లేకుండా తెలంగాణ రాష్ట్రంను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కానీ రైతులకు భారత రాష్ట్ర సమితి పక్షాన అం డగా నిలబడుతుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బి అర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీలు మాడుగుల రాజు, కర్మిల్ల మోహన్ రావు, మాజీ సర్పంచ్ లు గోనె సంపత్, చిన్నపాక శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్, అమడగాని రాజు, బానోత్ వెంకన్న, మాజీ బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షలు రంగు కుమార్, మండల సీనియర్ నాయకులు మట్టపెల్లి చిన్న మాధవరావు, చింతల శ్రీనివాస్, మండల రైతు విభాగం అధ్యక్షుడు బాల్లే వెంకట్రాజ్యం, యూత్ విభాగం అధ్యక్షుడు బూర శ్యామ్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు బరిగేల విజయ, సోషల్ మీడియా కన్వీనర్ బోట్ల భాస్కర్, నాయకులు కొండ వెంకన్న, రంగు కుమార్, అదొండ బిక్షపతి, చిరుత విజయ్, బానొత్ బాలు, దేవేందర్, బాసాని బిక్షపతి, దొమ్మటి రాజు, కందికట్ల ప్రవీణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img